Suicide | మారేడ్పల్లి, జూలై 3 : మతిస్థిమితం లేని ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన చీర సాయి ప్రకాశ్ (22) బిటెక్ చదువుతున్నాడు. గత కొంత కాలంగా అతని మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో రెండు నెలలుగా మానసికంగా బాధపడుతున్నా డు. జీవితంపై విరక్తి చెందిన అతను ఘటుకేసర్-బీబీనగర్ రైల్వే స్టేషన్ల మధ్యన చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరు కొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.