Suicide | జీడిమెట్ల, ఏప్రిల్ 3 : ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు మనస్థాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల సంజయ్ గాంధీనగర్‌కు చెందిన యండి గౌస్ పాషాకు నలుగురు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం. యండి ఇమ్రాన్ పాషా (27) పాన్ షాపు నిర్వహిస్తున్నాడు. గత సంవత్సరం నిశ్చితార్థం జరిగింది.
అయితే గత కొన్ని రోజుల నుంచి ప్రేమ విఫలమైందని తీవ్ర మనస్థాపానికి గురై ఒకసారి నిద్ర మాత్రలు మింగాడు. అప్పుడప్పుడు చనిపోతానని వస్తువులతో తలపై కొట్టుకునేవాడు. ఈ నెల 1వ తేదీన రాత్రి భోజనం చేసిన అనంతరం తన గదిలోకి వెళ్ళాడు. ఉదయం ఎంతకి తలుపు తీయకపోవడంతో కిటికిలోంచి చూడగా ఇమ్రాన్ పాషా తన గదిలో సిలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో మృతుడి అక్క వరుసకు తమ్ముడు అయిన యండి సల్మాన్ అనే వ్యక్తిని పిలువగా అతను వచ్చి తలుపులు పగులగొట్టి తీయగా అప్పటికే తన తమ్ముడు మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి అక్క ఫర్హన తబస్సం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.