Road Accident | హైదరాబాద్ : సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాపూర్ నగర్ నుండి సూరారం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఇసుక లోడుతో వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని గాగిల్లాపూర్కు చెందిన సాయికుమార్(21)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.