Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. హోటల్లో కుక్క వెంటపడడంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్న తెనాలి వాసి ఉదయ్(23) తన స్నేహితులతో కలిసి చందానగర్‌లో ఉన్న వీవీ ప్రైడ్ హోటల్‌కు వెళ్లాడు. హోటల్ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే అక్కడున్న కుక్క వెంటపడింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఉదయ్.. కుక్క నుంచి తప్పించుకునే క్రమంలో హోటల్ కిటికీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా, బయటకు రాకుండా హోటల్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఉదయ్ స్నేహితులు ఈ విషయాన్ని బయటకు చెప్పడంతో నిన్న వెలుగు చూసింది. కుక్క వెంటపడడం, ఉదయ్ పరుగెత్తిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | హైదరాబాద్ మహానగరంలో 24, 25న నీటి సరఫరా బంద్
KCR | రాసిపెట్టుకోండి.. 2028లో కేసీఆరే సీఎం..
T SAT | ఉద్యమకారుడు చేగొండి చంద్రశేఖర్ ఉద్యోగం ఊస్ట్..! తొలగించిన టీశాట్ యాజమాన్యం