Suicide : ప్రియుడు అనుమానించాడని ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడు వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నావని నిలదీయడంతో వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఖమ్మం సమీపంలోని కొత్తగూడెం పట్టణానికి చెందిన ఐశ్వర్య (19) తన అన్న అరవింద్‌తో కలిసి తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో అద్దెకు ఉంటోంది. అయితే వీరికి దూరపు బంధువైన మహేష్ అలియాస్ ఆనంద్ (23) నగరంలోని హస్తినాపురంలో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. ఏడాది క్రితం జరిగిన అయ్యప్ప పూజలో ఐశ్వర్యను చూశాడు.
అప్పటి నుంచి తరచూ ఐశ్వర్య ఇంటికి వచ్చేవాడు. ఇటీవల ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. దాంతో ఆ యువతి ఒప్పుకుంది. అయితే వారి పెళ్లికి మొదట పెద్దలు నిరాకరించారు. తర్వాత నచ్చజెప్పడంతో ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఐశ్వర్య మరెవరితోనో ఫోన్లో మాట్లాడుతోందని ఆనంద్ అనుమానం పెంచుకున్నాడు.