Murder | మెహదీపట్నం, జులై 21 : ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకున్నది. పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌నగర్‌లోని మొహమ్మద్ ఖబులా అలియాస్ అడ్డుఖాన్ (27) అనే యువకుడు సోఫాలు తయారు చేస్తుంటాడు. అతనికి గత కొద్దిరోజులుగా సమీర్, వసీం అనే వ్యక్తులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత రాత్రి కిషన్‌రావు నగర్‌లోని రాహత్ హోటల్‌కు సమీపంలోని అడ్డుఖాన్ తన స్నేహితుడితో కలిసి మద్యం తాగుతున్నాడు.
అదే సమయంలో సమీర్, వసీం మరికొందరు యువకులతో వచ్చి అతనిపై దాడి చేశారు. పెద్ద బండరాయితో తలపై కొట్టి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేసి అన్నికోణాల్లో విచారిస్తున్నట్లు ఆసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్ కుమార్ తెలిపారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వివరించారు.