Murder | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. బేగంపేటలోని గ్రీన్ ల్యాండ్ ప్రాంతం సమీపంలో ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు అసోం రాష్ట్రానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.