Missing | నేరేడ్మెట్, ఫిబ్రవరి 26 : ఇంట్లో నిత్యం తల్లిదండ్రులు గొడవ పడుతుండడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన కూతురు అదృశ్యమైంది. ఈ ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
నేరేడ్మెట్ పీఎస్ ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానందపురంలో నివాసం ఉంటున్న జుమ్మి మొహంతా, ప్రదీప్ కుమార్ భార్యభర్తలు. వీరికి కూతురు సాగోరిక మొహంత (22) ఉన్నారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులు రోజు గొడవ పడేవారు. దీంతో కూతురు సాగోరిక మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంటినుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇండ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తామని తెలిపారు.