Chest Hospital | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులు అస్తవ్యస్తంగా మారాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇందుకు నిదర్శనం.. ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్లో చోటు చేసుకున్న ఘటనే.
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో ఓ ఉద్యోగి మద్యం సేవిస్తూ మీడియా ప్రతినిధి కంటపడ్డాడు. దర్జాగా బెడ్ మీద మద్యం పెట్టుకుని.. తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అది కూడా ఆక్సిజన్ ప్లాంట్ పక్కనే. ఈ తతంగాన్ని మీడియా ప్రతినిధి తన సెల్ఫోన్లో రికార్డు చేశాడు. ఐడీ కార్డు చూపించమని అడిగితే మద్యం సేవించిన వ్యక్తి వెనుకంజ వేశాడు. చివరకు ఈ వీడియో వైరల్ కావడంతో ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. విచారణ చేపట్టామని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉద్యోగిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ వద్ద మద్యం సేవిస్తూ పట్టుబడ్డ వార్డ్ బాయ్
హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ వద్ద డ్యూటీ సమయంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ వార్డ్ బాయ్
ప్రాణాలు ఆధారపడే చోట, ఇలాంటి అనాగరిక చర్యలు ఏంటని… pic.twitter.com/5CvryHMTtE
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2025