Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్‌లోని ఆంధ్ర యువతి మండలిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 349లో ఓటు వేసేందుకు ఓ మహిళ వచ్చింది. ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రంలోనే ఆమె కుప్పకూలిపోయారు.
దీంతో హుటాహుటిన ఆమెను ఉప్పల్‌లోని టీఎక్స్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలిని భరత్‌నగర్‌కు చెందిన గట్టు విజయలక్ష్మి(65)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం 12.10 గంటలకు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.