3 సెకన్లలోపే కుప్పకూలిన జీవితం
చికిత్స నిమిత్తం బొల్లారం కంటోన్మెంట్ దవాఖానకు వస్తున్న దంపతులపై చెట్టు విరిగి పడడంతో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం బొల్లారం పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..
- దవాఖానలో దంపతులపై కూలిన చెట్టు
- భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
బొల్లారం, మే 21 : చికిత్స నిమిత్తం బొల్లారం కంటోన్మెంట్ దవాఖానకు వస్తున్న దంపతులపై చెట్టు విరిగి పడడంతో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం బొల్లారం పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట, తూముకుంట ప్రాంతానికి చెందిన రవీందర్(56) ప్రైవేటు ఉద్యోగి. సరళా దేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
మంగళవారం ఉదయం 10గంటల సమయంలో సరళాదేవికి కీళ్ల వ్యాధికి సంబంధించిన ఇంజెక్షన్ నిమిత్తం ద్విచక్ర వాహనంపై బొల్లారం కంటోన్మెంట్ దవాఖానకు వచ్చారు. దవాఖానలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా వారిపై కూలిపడింది. ఈ ఘటనలో రవీందర్ అక్కడికక్కడే మృతిచెందగా.. సరళాదేవి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. మూడు సెకన్లలోనే చెట్టు కూలిపోయిన దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

