హైదరాబాద్ : మణికొండ అల్కాపురి కాలనీలో(Alkapuri Colony) విషాదం చోటు చేసుకుంది. గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్(Software engineer) ఆకస్మికంగా మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..శ్యామ్ ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాత్రి అల్కాపురి టౌన్ షిఫ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన లడ్డు వేలంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు.
రూ.15 లక్షల వరకు లడ్డు వేలం పాట పాడి, గణనాథుడి మండపం వద్ద నృత్యాలు చేస్తూ సంతోషంగా గడిపినట్లు స్థానికులు తెలిపారు. కాగా, ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే గుండెపోటుతో(Heart attack) శ్యామ్ ప్రసాద్ మృతి చెందాడు. శ్యామ్ ప్రసాద్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
lso Read..