Raghava Lawrence | ప్రముఖ కోలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం కాంచన 4 సినిమాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఒకవైపు జరుగుతుండగా.. మరోవైపు క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్గా బాలీవుడ్ నుంచి చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం కిల్ (Kill Movie).
బాలీవుడ్ యువ నటులు లక్ష్ లాల్వానీ (Lakshya), తాన్య మనక్తిలా (Tanya Maniktala), రాఘవ్ జుయల్ (Raghav Juyal) ప్రధాన పాత్రల్లో నటించగా.. సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకు నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించగా.. ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం జులై 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సినిమాలోని ఫైట్ సీన్స్‌కు అయితే ప్రేక్షకులు థ్రిల్ అవ్వడం ఖాయం అని చెప్పారు. ఇక తెలుగు నుంచి వచ్చిన కల్కి సినిమాను తట్టుకుని బాక్సాఫీస్ వద్ద గట్టి పోటి నిచ్చింది ఈ చిత్రం. ఇదిలావుంటే ఈ సినిమాను రాఘవ లారెన్స్ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఏ స్టూడియోస్ లిమిటెడ్, హవిష్ ప్రోడక్షన్ బ్యానర్లపై ఈ సినిమా వస్తుంది. కాగా ఈ ప్రాజెక్ట్‌పై మరింత సమాచారం త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Buzz – Blockbuster #Kill movie going to be remade in Tamil & Telugu 👀
Starring #RaghavaLawrence & it’s going to be his 25th film (#RL25)🌟
Directed by Telugu Dir RameshVarma (Khiladi Fame)🎬 pic.twitter.com/VLrBiEUCEz— AmuthaBharathi (@CinemaWithAB) September 15, 2024
Also read..