Devara Movie | మరో 11 రోజుల్లో ‘దేవర’ సందడి షురూ కానున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్లో బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా 5 లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు రీసెంట్గా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇదిలావుంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబుని పిలవాలని దేవర టీం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భరత్ అనే నేను ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వచ్చి సందడి చేశాడు. దీంతో అప్పటినుంచి మహేశ్ – తారక్‌ల మధ్య బాండింగ్ మరింత ఎక్కువ అయ్యింది. అయితే ఈ ఈవెంట్‌కు మాత్రం మహేశ్ వస్తే అభిమానులకు ఆనందానికి హద్దు లేకుండా పోతుందని చెప్పవచ్చు.
హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు జనతా గ్యారేజ్ ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. సైఫ్ అలిఖాన్ విలన్ రోల్లో నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read..