Bigg Boss Shekar Basha Elimination | బుల్లితెర రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 సస్పెన్స్, ట్విస్ట్‌లతో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయిన ఈ షో ప్రేక్షకులకు మాత్రం ఎంటర్టైనమెంట్ ఇవ్వడంలో ఏమాత్రం తగ్గట్లేదు. అయితే ఈ సీజన్ మొదటివారం బేబక్క ఎలిమినేషన్ అవ్వగా.. ఈ వారం శేఖర్ బాషా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఇందులో షాక్ విషయం ఏంటి అంటే.. తొలివారం బేబక్క ఎలిమినేట్ అవుతుందని ఆడియన్స్ భావించిన ఈ వారం మాత్రం శేఖర్ బాషా ఎలిమినేట్ అవుతాడని ఎవరు అనుకోలేదు. అయితే శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వడానికి గల అసలు కారణం తెలిసింది. ల
శేఖర్ బాషా హౌస్ నుంచి వెళ్లిపోవడానికి గల ముఖ్య కారణం తన భార్య డెలివరీ కావడమేనట. తన భార్య డెలివరీ కావడం వలన హౌస్ నుంచి బయటకు రావాలని శేఖర్ భావించినట్లు సమాచారం. దీంతో ఆడియన్స్ వేసిన ఓట్లను పక్కన పెట్టి బిగ్ బాస్ నిర్ణయంతో ఈ వారం ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు హౌస్ నుంచి బయటకు వెళ్లన శేఖర్ బాషాకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ దక్కినట్లు తెలుస్తుంది. ఆయన ఉన్న రెండు వారాలకు గాను వారానికి రూ.2.5 లక్షలు చొప్పున రెండు వారాల్లో రూ.5 లక్షల్ని బిగ్ బాస్ నిర్వహాకులు ఇచ్చినట్లు సమాచారం.
Also Read..