Jani Master | జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు..
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గత కొంతకాలంగా తనను లైంగికంగా వేదిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసుల ఫిర్యాదుచేసింది.
హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గత కొంతకాలంగా తనను లైంగికంగా వేదిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసుల ఫిర్యాదుచేసింది. దీంతో హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అతనిపై సెక్షన్ 376 (రేప్) కేసుతో పాటు బెదిరింపు (506), గాయపరచడం (323) క్లాజ్ (2) కింద కేసులు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నార్సింగ్ పీఎస్‌కు బదిలీ చేశారు. ఔట్ డోర్ షూటింగ్స్ టైంలో, నార్సింగిలోని తన నివాసంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని అందులో పేర్కొన్నది.
మధ్యప్రదేశ్‌కి చెందిన 21 ఏండ్ల మహిళ.. గత ఆరు నెలలుగా జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నది. చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో ఔట్ డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని చెప్పుకొచ్చింది. నార్సింగిలోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురిచేసినట్లు పేర్కొంది.
జానీ మాస్టర్‌పై గతంలోనూ కేసులు నమోదయ్యాయి. 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి చేసిన కేసులో 2019లో మేడ్చల్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఇక ఈ ఏడాది జూన్‌లో సతీష్ అనే కొరియోగ్రాఫర్ కేసు పెట్టాడు. సినిమాల్లో అవకాశాలు రాకుండా తనని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

