మాదాపూర్, జూన్ 16: గంజాయి చాక్లెట్ల విక్రేతను ఆదివారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ కథనం ప్రకారం.. శేరిలింగంపల్లిలోని నెహ్రూనగర్‌కు చెందిన బియాస్ గుప్తా (46) ఉత్తరప్రదేశ్ నుంచి గంజాయి చాక్లెట్లను కొనుగోలు చేసి, వాటిని తెలిసిన వారికి విక్రయిస్తున్నాడు. శనివారం సాయంత్రం హఫీజ్‌పేటలోని వసంత్సిటీ వద్ద ఓ వ్యక్తికి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి వద్ద 320 గంజాయి చాక్లెట్లు, 8 గంజా మిక్స్డ్ చాక్లెట్లు, చార్మినార్ గోల్డ్ మునక్కా ప్యాకెట్లు 1.65 కేజీలతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని, సీజ్ చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.