హైదరాబాద్ : కష్టపడకుండా అక్రమార్గంలో డబ్బులు సంపాదించాలని ఓ వ్యక్తి భావించాడు. అందుకు నకిలీ తహసీల్దార్(Fake tehsildar )అవతారమెత్తాడు. ఇలా పలువురిని బెదిరిస్తూ అక్రమాలకు(Illegal collections) పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లాలోని పూడూరు గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి నకిలీ తహసీల్దార్‌గా చెలామణి అవుతూ అక్రమాలకు పాల్పడుతున్నాడు.
ఇదే క్రమంలో జిల్లాలోని సోమారం గ్రామానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని డబ్బులు కోసం బెదిరిం చాడు. తాను మేడ్చల్ తహసీల్దార్‌ను అంటూ రూ.3కోట్లు ఇవ్వాలని డిమాండ్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మహేందర్ రెడ్డిని రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.