బంజారాహిల్స్,జూన్ 14 : తనకు అర్జెంట్‌గా డబ్బులు అవసరం ఉందని, పేటీఎమ్(Paytm) ద్వారా మీకు పంపిస్తానంటూ బురిడీ కొట్టిస్తున్న వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ (Arrest)చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ డీఐ మధుసూధన్ తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్‌కు చెందిన నర్రా సందీప్ కుమార్ అనే యువకుడు గత కొంతకాలంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఏటీఎమ్ సెంటర్లు, పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి తనకు అర్జెంట్‌గా డబ్బులు కావాలని, నగదు ఇస్తే పేటీఎం ద్వారా నేరుగా డబ్బులు అకౌంట్‌కు పంపిస్తానంటూ నమ్మిస్తూ నకిలీ యాప్ ద్వారా బురిడీ కొట్టిస్తున్నాడు.
జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో రాజు అనే వ్యక్తి నుంచి రూ.35వేలు, శ్రీను అనే వ్యక్తి నుంచి రూ.12వేలు ఇదే విధంగా తీసుకుని పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడు సందీప్‌ను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఏటీఎం కేంద్రాలు, పెట్రోల్ బంకులు, హోటల్స్ వద్ద ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని, గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు పంపిస్తామంటే నమ్మవద్దని డీఐ మధుసూధన్ సూచించారు.