Kacheguda Railway Station | హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడికి త్రుటిలో ప్రాణపాయం తప్పింది. రైలు పట్టాలపై పడిపోతున్న ఆ ప్రయాణికుడిని గమనించిన తోటి ప్రయాణికులు, కానిస్టేబుల్స్.. అతన్ని ప్లాట్‌ఫామ్‌పైకి లాగారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
వరంగల్‌కు చెందిన మణిదీప్ అనే వ్యక్తి బెంగళూరు వెళ్లేందుకు ఈ నెల 26న కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఇక బెంగళూరు వెళ్లాల్సిన రైలు ఎక్కాల్సి ఉండగా, తొందరలో మరో రైలు ఎక్కాడు. దీంతో ఆ రైలు దిగేందుకు యత్నించగా.. అప్పటికే రైలు వేగంగా ముందుకు కదిలింది. దీంతో మణిదీప్ రైలు చక్రాల కింద పడబోయాడు. గమనించిన తోటి ప్రయాణికులు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అప్రమత్తమైన అతడిని పక్కకు లాగారు. దీంతో మణిదీప్ ప్రాణాలతో బయటపడ్డాడు.
రన్నింగ్ ట్రైన్ దిగబోయి కిందపడ్డ యువకుడు
అప్రమత్తమై కాపాడిన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది
కాచిగూడ రైల్వే స్టేషన్లో రాంగ్ ట్రైన్ ఎక్కి దిగేందుకు యత్నించి.. ట్రైన్ కిందపడ్డ మణిదీప్ అనే యువకుడు
అప్రమత్తమై మణిదీప్ని కాపాడిన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది pic.twitter.com/26QFRjyWt0
— Telugu Scribe (@TeluguScribe) October 28, 2025