బంజారాహిల్స్,జనవరి 8 : రోడ్డు మీద వెళ్తున్న బాలికను అడ్రస్ అడుగుతున్నట్లు నటించి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌లోని ఇబ్రహీంనగర్ ప్రాంతంలో రోడ్డుమీద వెళ్తున్న బాలిక(15)వద్దకు బైక్‌మీద వచ్చిన ఆగంతకుడు హాస్పిటల్ ఎక్కడుందంటూ అడిగాడు.
అడ్రస్ చెబుతున్న బాలికను అసభ్యకరమైన రీతిలో తాకుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించాడు.
దీంతో ఆందోళనకు గురయిన బాలిక అక్కడినుంచి పరుగుతీసింది. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆగంతకుడి బైక్ నెంబర్ పోలీసులకు ఇచ్చిన బాలిక అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.