సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 7 : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 16న వెయ్యి మందితో మెగా రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ పేర్కొన్నారు. మంగళవారం మంత్రి కేటీఆర్ తన కార్యాలయంలో రక్తదాన శిబిరం పోస్టర్‌ను జిల్లా శాఖ అధ్యక్షుడు ముజీబ్‌హుస్సేనీ, కార్యదర్శి ఎస్.విక్రమ్‌కుమార్‌లతో కలిసి ఆవిష్కరించారు.
ఈ మెగా రక్తదాన శిబిరానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శి రాజేందర్, ప్రతాప్ హాజరవుతారని చెప్పారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఉద్యోగులంతా కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.