కొండాపూర్, ఆగస్టు 21 : చేసిన అప్పులు తీర్చలేమోననే భయంతో వివాహిత(Married woman) ఉరివేసుకుని ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడిన సంఘటన చందానగర్(Chandanagar) పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన వరలక్ష్మి (34), సత్య శివప్రసాద్‌తో గత 6 నెలల క్రితం వివాహం జరిగింది. ఉద్యోగ నిమిత్తం నగరానికి వచ్చి చందానగర్‌లోని కైలాష్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.
సత్య శివప్రసాద్ ఓ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, వివాహానికి ముందు చేసిన అప్పులు తీర్చలేక భయాందోళనకు లోనైన వరలక్ష్మి మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సత్య శివప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read..
Badlapur | బద్లాపూర్ ఘటన.. 300 మంది నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు
Bus Overturns | ఇరాన్లో బస్సు బోల్తా.. 28 మంది పాకిస్థాన్ యాత్రికులు మృతి