Hyderabad | కాచిగూడ, మే 11 : భర్తతో గొడవ పడి భార్య అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై హెచ్. నరేష్ వివరాల ప్రకారం కాచిగూడ హర్రస్ పెంట ప్రాంతానికి చెందిన రాఘవేంద్ర భార్య బాల త్రిపుర సుందరి(24) భర్తతో గొడవపడింది. ఈ క్రమంలో తీవ్ర మస్తాపానికి గురైన ఆవిడ.. ఈనెల 9వ తేదీన ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాలు, స్నేహితులు, కుటుంబీకుల ఇళ్లల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించక పోవడంతో భర్త రాఘవేంద్ర కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.