వనస్థలిపురం, నవంబర్ 20: అన్ని వర్గాల ప్రజల ఆధ్మాత్మికత, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షుడు ముద్దగౌని సతీశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శివ మహాపడి పూజ వైదేహినగర్లో నిర్వహించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి రామ్మోహన్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎవరూ ఊహించని విధంగా యాదాద్రిని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. సాహెబ్‌నగర్ త్రినేత్రాంజనేయ దేవస్థానానికి రూ.15కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మాలధారణ స్వాములు తనకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. శివుడి ఆశీస్సులు, ప్రజా ఆధరణతో మారోసారి అసెంబ్లీకి వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న, సీనియర్ నాయకులు జగన్మోహన్, 3వేల మంది మాలధారణ స్వాములు పాల్గొన్నారు.
నాగోల్‌లో జోరుగా బీఆర్ఎస్ ప్రచారం
మన్సూరాబాద్, నవంబర్ 20: బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి మద్దతుగా నాగోల్ డివిజన్ పరిధి జనప్రియకాలనీ, ఇంద్రప్రస్తకాలనీ, సాయిసప్తగిరి కాలనీల్లో సోమవారం మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోచబోయిన గణేశ్‌యాదవ్, బీఆర్ఎస్ మహిళా విభాగం డివిజన్ అధ్యక్షురాలు ప్రమీల, నాయకులు ఏర్పుల యాదయ్య, అశోక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి
హయత్‌నగర్, నవంబర్ 20: అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ సమన్వయ కమిటీ కన్వీనర్లు జోగు రాములు, ఏర్పుల దేవప్రసన్నకుమార్, అడాల రమేశ్, గంగం శివశంకర్ అభ్యర్థించారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హయత్‌నగర్ డివిజన్లోని ఓల్డ్ విలేజ్‌లో ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కడారి పెంటయ్య, గంగని నాగేశ్, కిరణ్, శ్రీధర్, చుంచు వరలక్ష్మి, బోడ శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి
చంపాపేట, నవంబర్ 20: కర్మన్‌ఘాట్‌లోని దుర్గానగర్, మాధవనగర్, డిఫెన్స్‌కాలనీ, కర్మన్‌ఘాట్ ఓల్డ్ విలేజీ, క్రాంతినగర్, శివాలయం కాలనీల్లో కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ ఆలయ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నేత నల్ల రఘుమారెడ్డి ప్రచారం నిర్వహించారు. కారుగుర్తుకు ఓటేసి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి, నాయకులు భానుప్రకాశ్‌రెడ్డి, మేక సురేందర్, శ్రీనివాస్‌రెడ్డి, గోగు శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సుధీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
ఎల్బీనగర్, నవంబర్ 20: ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా కోరారు. చైతన్యపురి, లింగోజిగూడతో పాటు పలు డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మారుతీనగర్ ప్రాంతంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా పాల్గొని మాట్లాడారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు తోట మహేశ్‌యాదవ్, బొగ్గారపు శరత్చంద్ర, కోతి నర్సిరెడ్డి, రవీందర్‌రెడ్డి, భూపేశ్రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా చైతన్యపురిలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో, ఎల్బీనగర్ మజీద్ గల్లీలో తెలంగాణ బీసీల జేఏసీ ఛైర్మన్ ఓరుగంటి వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎల్బీనగర్ అభివృద్ధి ఘనత బీఆర్ఎస్దే
వనస్థలిపురం, నవంబర్ 20: ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ సోమవారం హస్తినాపురం డివిజన్లోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఓటర్లను నేరుగా కలిసి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సుధీర్రెడ్డితోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థాయిలో ఉందన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. హస్తినాపురం డివిజన్లో అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. ప్రతి పక్షాలకు ఓటు వేసే తెలంగాణ ఆగమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మానాయక్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.