Suicide | బండ్లగూడ, మే 22 : అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీలో నివాసం ఉండే గోపాల్ (51) రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.