Murder : రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగిలో ఓ వ్యక్తి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి రాజు అనే వ్యక్తిని అతి కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. హత్య అనంతరం దుండగుడు నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
దాంతో పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. కాగా ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని విమర్శలు వస్తున్నాయి.