హైదరాబాద్ : చిరంజీవి(Chiranjeevi) సినిమా చూస్తూ ఓ అభిమాని థియేటర్లోనే కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన కూకట్పల్లిలోని(Kukatpally) అర్జున్ థియేటర్లో చోటు చేసుకుంది. చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా చూస్తూ ఓ మృతి చెందాడు. గమనించిన థియేటర్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిరంజీవి సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి
హైదరాబాద్ – కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్లో, చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమా చూస్తూ మృతి చెందిన అభిమాని
గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు pic.twitter.com/zgXIHmEB3L
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2026