బంజారాహిల్స్,డిసెంబర్ 26: అర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం పాలయిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సూరారం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఎర్రా ఈశ్వర్రావు(42) అనే వ్యక్తి జూబ్లీహిల్స్‌లోని నానీ టిఫిన్ సెంటర్లో పనిచేస్తుంటాడు. శుక్రవారం ఉదయం పనికోసం వెంకటగిరి వైపునుంచి జూబ్లీహిల్స్‌కు వెళ్తున్న క్రమంలో అతివేగంతో వచ్చిన ఆర్టీసీకి చెందిన ఎలక్ట్రికల్ బస్సు ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఈశ్వర్రావు అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు రాణిగంజ్ డిపోకు చెందినదని గుర్తించిన పోలీసులు బస్సు డ్రైవర్ రాంబాబును అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.