హైదరాబాద్ : నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. స్కూటీని లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..ఆరంగర్ చౌరస్తాలో ఆక్టివా స్కూటీపై వెళ్తున్న వ్యక్తి పై నుంచి రెడీమిక్స్ లారీ దూసుకెళ్లింది. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా,హసంనగర్ పెట్రోల్ పంప్ సమీపంలో మృతుడు నివసించే వాడని సమాచారం. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.