హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో(,Rangareddy) విషాదం చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంకున్న భర్త(Husband )తనువు చాలించాలని నిశ్చయించుకున్నాడు. దీంతో బలవన్మరణానికి(Commits suicide) పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామానికి చెందిన గంగనమోని నగేష్ (25)కి ఇటీవల ఒక మహిళతో వివాహం జరిగింది. అయితే కొంతకాలంగా తన భార్య మరొక వ్యక్తితో చనువుగా మాట్లాడుతోందని మనోవేదనకు గురై నగేష్ తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగేష్ మృతితో గౌరెల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతుందని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న భర్త
రంగారెడ్డి – యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామానికి చెందిన గంగనమోని నగేష్ (25)కి ఇటీవల ఒక మహిళతో వివాహం జరిగింది.
కొంతకాలంగా తన భార్య మరొక వ్యక్తితో చనువుగా మాట్లాడుతోందని మనోవేదనకు గురై తన ఇంట్లో ఫ్యానుకు… pic.twitter.com/RfIcHEaao7
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2024