Hyderabad | బంజారాహిల్స్, మే 20 : ఇంటి వద్ద డ్రాప్ చేస్తామంటూ నమ్మించి బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే విద్యార్థిని (17) ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఈనెల 19న తన సోదరితో కలిసి బయటకు వచ్చింది. అక్కడి నుంచి సోదరి వేరే పనిమీద వెళ్లిపోగా విద్యార్థిని ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. మధ్యలో సమీప బంధువైన నవీన్ కలిసి తాను ఇంటి వద్ద డ్రాప్ చేస్తా అంటూ బైక్ మీద ఎక్కించుకున్నాడు.దారిలోనే దేవరకొండ బస్త్తీలోని తన ఇంట్లో చిన్న పని ఉందంటూ తీసుకువచ్చాడు. ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఈ మేరకు విద్యార్థిని తనమీద జరిగిన దారుణాన్ని సోదరుడికి చెప్పింది. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో లైంగిక దాడి చేసిన నవీన్ మీద బంజారాహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.