GHMC | హైదరాబాద్ : శానిటేషన్ విభాగానికి చెందిన ఓ మహిళా సిబ్బంది పట్ల జీహెచ్ఎంసీ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెపై లైంగికదాడికి పాల్పడేందుకు యత్నించాడు. ఈ ఘటన జీహెచ్ఎంసీ పరిధిలోని గాజులరామారంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గాజులరామారం పరిధిలోని శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ అధికారి కిషన్.. గత కొంతకాలం నుంచి మహిళా సిబ్బందిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఒంటరిగా ఉన్న మహిళలను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. వారితో అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలను తన మొబైల్లో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తన మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానని, వీడియోలను బయట పెడుతానని హింసిస్తున్నాడు. దీంతో బాధిత మహిళలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మహిళలను వేధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయినప్పటికీ అధికారులు కిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.