మారేడ్‌పల్లి, జూలై 22: తోడు దొంగల విడుదల కోసం రైళ్లలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 3 లక్షల విలువ చేసే 35 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసు స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను రైల్వే డీఎస్పీ జావెద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు వెల్లడి చారు.
కర్ణాటక రాష్ట్రం రాయచూర్ ప్రాంతానికి చెందిన మోతీలాల్ రెడ్డప్ప పవార్ అలియాస్ మోతీలాల్ (24) జీవనోపాధి నిమిత్తం పుణే, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లాడు. పని చేస్తే వచ్చే ఆదాయం సరిపోక వడంతో నేరాల బాట పట్టాడు. 30 కి పై ఆస్తి సంబంధిత నేరాల్లో పాల్గొని పాలయ్యాడు. ఇటీవలే బెయిల్ పై విడుదలై ప్రస్తుతం నగరంలోని వివిధ లాడ్జీల్లో బస చేస్తూ రైళ్లలో ప్రయాణం చేస్తున్న మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడం పనిగా పెట్టుకున్నారు.
ఇతనికి సంబంధించిన మరి కొంత మంది తోడు దొంగలు జైలు నుంచి విడుదల కాకపోవడంతో బెయిల్ కోసం అడ్వకేట్‌ను సంప్రదించగా ఫీజు అడగడంతో…మళ్లీ నగరానికి వచ్చి రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 14 పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో , 19వ తేదీన ఎంఎంటీఎస్ రైల్లో మహిళల గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తును ప్రారంభించారు. ఈ నెల 21వ తేదీన మెతీలాల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నాడు.