హైదరాబాద్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో యువతులు హల్చల్ చేశారు. మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు. బైకర్‌ను బెదిరించడంతో అతడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కారు నడుపుతున్న యువతికి బ్రీత్ అనలైజర్‌తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా 212 పాయింట్లు నమోదయింది. దీంతో మద్యం తాగినట్లు నిర్ధారించారు. కారులో డ్రైవింగ్ చేస్తున్న యువతితోపాటు మరికొందరు ఉన్నారు. వారంతా ఫుల్లుగా మద్యం సేవించినట్లు తెలిపారు. కారులో బీర్ క్యాన్లను గుర్తించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.