మెహిదీపట్నం, ఏప్రిల్ 23: అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి ఏటీఎం కేంద్రంలో మృతిచెందిన ఘటన మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం కలకలం రేపింది. ఇన్స్పెక్టర్ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం… మెహిదీపట్నం విజయ్‌నగర్ కాలనీ ప్రాంతంలోని రియాన్ హోటల్ సమీపంలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉన్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.