మైలార్దేవ్పల్లి, నవంబర్ 16: వీధి కుక్కల దాడిలో ఓ ఐదేండ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధి పద్మశాలిపురానికి చెందిన రఫీ, హైసా దంపతుల కూతురు గులాబ్షా పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి ఆడుకునేందుకు బయటకు వచ్చింది.
ఇంటి ముందు ఆడుకుంటుండగా, వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేశాయి. చిన్నారి గట్టిగా కేసులు వేయడంతో స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. తీవ్రంగా గాయపడిన గులాబ్షాను కుటుంబసభ్యులు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించారు.