Child Dies | కుత్బుల్లాపూర్ : ట్యూషన్‌కు వెళ్తున్న తన అన్నకు బాయ్ చెప్తూ.. ఓ ఏడాదిన్నర చిన్నారి రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ డివిజన్ ప్రాంతంలో ఎండీ నజీమ్ తన భార్యాపిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. స్థానికంగా ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనంలోని రెండో ఫ్లోర్లో అద్దెకు ఉంటున్నారు. ఈనెల 8న సాయంత్రం సమయంలో పెద్ద కుమారుడు అద్నాన్ ట్యూషన్‌కు వెళ్తున్నాడు. ఇక అన్నకు బాయ్ చెప్పేందుకు ఏడాదిన్నర చిన్నారి సిద్ర ఆనం డోర్ ముందు ఉన్న గ్రిల్స్ వద్దకు చేరుకుంది. కింద ఉన్న తన అన్నకు బాయ్ చెప్తూ.. ప్రమాదవశాత్తు గ్రిల్స్ నుంచి కిందకు జారీ పడింది. దీంతో గాయాల పాలైన చిన్నారిని హుటాహుటిన నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. చిన్నారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.