బంజారాహిల్స్,జనవరి 8: పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకోవడమే కాకుండా రూ.75లక్షలు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై ఫిలింనగర్ పీఎస్‌లో కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న యువతి(32)కు శంషాబాద్‌కు చెందిన వ్యాపారి రాణాప్రతాప్రెడ్డితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకోవడమే కాకుండా వ్యాపారం కోసం అంటూ రూ.785లక్షలు తీసుకున్నాడు. అయితే ఇటీవల పెళ్లికి నిరాకరించడంతో పాటు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ 69, 318 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.