బంజారాహిల్స్,ఫిబ్రవరి 23: నిషేదిత సిగరెట్లను(Banned cigarettes) విక్రయిస్తున్న కిరాణాషాపు నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..కృష్ణానగర్ బీ బ్లాక్‌లోని శ్రీ సాయి నర్సింహా కిరాణా అండ్ జనరల్ స్టోర్‌లో గత కొంతకాలంగా నిషేధించబడిన పలు బ్రాండ్లకు చెందిన సిగరెట్లను విక్రయిస్తున్నారన్న సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. సంచిలో నిల్వచేసిన పలు బ్రాండ్లకు చెందిన రూ.56వేల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు షాపు నిర్వాహకుడు ఏ.సాయిబాబాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.