Hyderabad | హైదరాబాద్‌లోని బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తాపడింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. కాగా, కారును డ్రైవ్ చేసిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా కారు బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కారును పక్కకు తీసి, ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు.