సిటీబ్యూరో: తాను కారు డీలర్లనని, తక్కువ ధరకు కారు విక్రయిస్తానంటూ.. నమ్మించిన సైబర్నేరగాడు.. నేరేడ్మెట్కు చెందిన ఓ వ్యాపారిని బురిడీ కొట్టించాడు. తాను గణేశాన్నని, ఆర్ఆర్ కారు డీలర్నంటూ.. సెకెండ్ హ్యాండ్లో కార్లు విక్రయిస్తానంటూ పరిచయం చేసుకున్నాడు. తన వద్ద 2023 మోడల్ హుందాయ్ అల్కజర్ కారు విక్రయానికి ఉన్నదని, దానిని తక్కువ విక్రయిస్తానంటూ మాట్లాడాడు.
రూ. 6.8 లక్షలకు అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే అసలు యజమాని కారు ఇచ్చేందుకు నిరాకరించాడు. గణేశాన్ పేరుతో సైబర్నేరగాడు ఓఎల్ఎక్స్లో పెట్టిన పోస్టును చూశాడు. యజమానితో మాట్లాడి కొట్టానన్నాడు. అదే కారును బాధితుడికి తక్కువ ధరకు విక్రయిస్తానంటూ నమ్మించి మోసం చేశాడు. ఇలా నయా పంథాలో ఓఎల్ఎక్స్లో సైబర్నేరగాడు మోసానికి పాల్పడ్డాడు.