Gun Miss Fire | హైదరాబాద్ : నార్సింగి గంధంగూడలో దారుణం జరిగింది. ఇంటిపై బట్టలు ఆరేస్తున్న మహిళ కాలిలోకి తూటా దూసుకెళ్లింది. తూటా బలంగా తగలడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న ఆర్మీ రేంజ్లో జవాన్లు ఫైరింగ్ శిక్షణలో ఉండగా ప్రమాదవశాత్తు ఓ బుల్లెట్ మహిళ కాలిలోకి దూసుకెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఏడాది జులై 13వ తేదీన నార్సింగి పరిధిలోని బైరాగీగూడలోని ఆర్క్ అద్వైత అనే అపార్ట్మెంట్లోకి బుల్లెట్ దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తులో ఉన్న ఓ ఇంటి బెడ్రూంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఇంట్లో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బుల్లెట్ వేగానికి కిటీకి అద్దం పగిలిపోయింది. అయితే ఆ సమయంలో బెడ్రూంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఇంటి యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, బెడ్రూంలో పడ్డ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా తుపాకీ మిస్ ఫైర్ అయినట్లు పోలీసులు తేల్చారు. ఈ కారణంగానే ఆ బుల్లెట్ ఆర్క్ అద్వైత అపార్ట్మెంట్ ఐదో అంతస్తులోని బెడ్రూంలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఇవి కూడా చదవండి..
Telangana Assembly | అసెంబ్లీని ముట్టడించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు.. అరెస్టు చేసిన పోలీసులు
Crop Loans | రెండో విడుత రైతు రుణమాఫీ నిధులు విడుదల