హైదరాబాద్ : సంక్రాంతి పండుగ వేళ ఎల్బీనగర్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. తండ్రీబిడ్డ కలిసి బైక్‌పై వెళ్తుండగా, చైనా మాంజ తగిలి ఆ పాప గొంతుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురం కమలానగర్‌కు చెందిన వినయ్ కుమార్ తన కుమార్తెతో కలిసి నాగోల్ బ్రిడ్జిపై వెళ్తున్నాడు. అయితే అక్కడున్న ఓ స్తంభానికి గాలిపటం తగిలి మాంజ తెగిపోయింది. మాంజను గమనించని వినయ్ తన బైక్‌ను వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ సమయంలో చైనా మాంజ అదే బైక్‌పై ఉన్న కుమార్తె మెడకు తగిలింది. దీంతో గొంతు తెగిపోయి, తీవ్ర రక్తస్రావం జరిగింది. చికిత్స నిమిత్తం చింతల్‌కుంటలోని రెయిన్బో ఆస్పత్రికి తరలించారు.