సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం అయింది. తొలి రోజు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తొమ్మిది మంది నామినేషన్ దాఖలు చేశారు. ఆవుల రవీందర్రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, కంది శైలజ, సబిహాబేగం, మన్నె కవితారెడ్డి, లాస్య దూసరి, బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, చింతల విజయశాంతి, సబితా కిశోర్ నామినేషన్ వేశారు. కాగా చివరగా తొమ్మిది మందిలో ఒక్కరు విత్డ్రా చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.