Readymade House | రెడీమేడ్ ఇండ్లకు యమ క్రేజ్.. రెడీ టూ మూవ్ ప్రాజెక్టులకు హైదరాబాదీల మొగ్గు
హైదరాబాద్ నగరంలో ఓ ఇల్లు కొనుక్కోవాలనేది సగటు సామాన్యుడి కల. అద్దె ఇంట్లో ఉండలేక, ఆ అవస్థలు పడలేక అప్పుచేసి లేదా బ్యాంకు రుణం తీసుకొని అయినా సొంతిళ్లు నిర్మించుకోవాలని.. అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు.
- 84 శాతం మందికి ఇదే ఆలోచన
Readymade House | సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో ఓ ఇల్లు కొనుక్కోవాలనేది సగటు సామాన్యుడి కల. అద్దె ఇంట్లో ఉండలేక, ఆ అవస్థలు పడలేక అప్పుచేసి లేదా బ్యాంకు రుణం తీసుకొని అయినా సొంతిళ్లు నిర్మించుకోవాలని.. అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో కొనుగోలుదారుల్లో ఇటీవల గణనీయమైన మార్పు వచ్చిందని, రెడీ టూ మూవ్ (సిద్ధంగా ఉన్న) ఇంటికే యమ డిమాండ్ నెలకొన్నదని ఇటీవల నో బ్రోకర్ వార్షిక రియల్ ఎస్టేట్ నివేదికలో వెల్లడించింది.
రియల్ అమ్మకాల్లో అత్యధికంగా సిద్ధంగా ఉన్న ఇంటినే కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారని, 84 శాతం మేర డిమాండ్ రెడీ టూ మూవ్ ఇండ్ల పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ముఖ్యంగా తమ సర్వేలో 87 శాతం మంది సొంతింటి కల వైపే మొగ్గుచూపగా..13 శాతం మంది పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చినట్లు నో బ్రోకర్ రియల్ ఎస్టేట్ సంస్థ కో ఫౌండర్ సుభాశ్ గార్గ్ తెలిపారు. ఎక్కువ శాతం రూ. 60 లక్షల లోపు గల డబుల్ బెడ్రూం ఇండ్ల పట్ల ఆసక్తి చూపినట్లు తెలిపారు. వీటితో పాటు కొనుగోలులో గృహ వాస్తుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చాలా మంది బిల్డర్లు 50 శాతం కంటే ఎక్కువగా అమ్మకాలను సాధించారని, కొనుగోలుదారుల డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకువస్తున్నారని వివరించారు.
ప్రత్యేకంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఐటీ కారిడార్‌లో విశాలమైన ఇంటికి ఆదరణ ఉన్నదని, కొనుగోలుదారుల కోరిక మేరకు విశాలమైన నివాసాల నిర్మాణం ఇక్కడ జరుగుతున్నదని, ప్రత్యేకించి ఐటీ కారిడార్‌లో చదరపు అడుగుకు రూ.11వేల పైగా ఉందన్నారు. రెడీ టూ మూవ్.. అత్యధికంగా కూకట్పల్లి, కొండాపూర్, మియాపూర్, మణికొండ, నిజాంపేటలో ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పుప్పాలగూడ, నిజాంపేట్, హఫీజ్‌పేట, మాదాపూర్, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో అద్దె ఇండ్లకు డిమాండ్ ఉండడంతో ఈ ఏరియాల్లో కూడా కొనుగోళ్లు పెరిగినట్లు వివరించారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

