సిటీబ్యూరో: రుతుపవన ద్రోణి ప్రభావంతో గురువారం రాత్రి గ్రేటర్లోని పలు చోట్ల వాన దంచికొట్టింది. రాత్రి 10 గంటల వరకు ఉప్పల్లో అత్యధికంగా 8.58 సెం.మీలు, నాచారంలో 7.88 సెం.మీలు, మెట్టుగూడలో 6.93 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
మరో రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, వర్షాల నేపథ్యంలో జలమండలి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.