సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో గ్రూప్- 2 పరీక్షకు చాలా మంది గైర్హాజరయ్యారు. కేవలం 40 శాతం మంది మాత్రమే పరీక్ష రాశారు. గ్రూప్ -2 పరీక్షకు 48,012 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆదివారం జరిగిన పరీక్షకు కేవలం 19,208 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 28,804 మంది గైర్హాజరయ్యాని చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 101 పరీక్ష కేంద్రాల్లో కొన్నింటిని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 39.32 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారని చెప్పారు. కాగా, సోమవారం కూడా గ్రూప్- 2 పరీక్ష జరగనున్నది.