మేడ్చల్ కలెక్టరేట్, మే 31 : జిల్లాలోని మల్కాజిగిరి ప్రభుత్వ వైద్యశాలలో జూన్ 6 నుంచి సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 6, 13, 14, 20, 21, 27వ తేదీల్లో సదరం క్యాంపులు ఉంటాయన్నారు. శిబిరానికి వచ్చే దివ్యాంగులు మీ సేవ ద్వారా బుక్ చేసుకున్న సదరం స్లాట్ రశీదు, ఆధార్ కార్డు జిరాక్స్, ఫొటో, తాజా మెడికల్ రిపోర్టలతో ఉదయం 9 గంటల వరకు హాజరు కావాలని సూచించారు. శనివారం నుంచి సదరం స్లాట్స్ మీ సేవలో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.