Ganja | హైదరాబాద్ : నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లో భారీగా గంజాయి పట్టుబడింది. అబ్దుల్లాపూర్మెట్లో వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా 11 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 6 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న డీసీఎంను సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ గంజాయిని సిమెంట్ సంచుల్లో నింపి.. తరలిస్తున్నట్లు తేలింది. ఎవరికి అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే గంజాయి వెహికల్కు ముందుగా ఓ వాహనం వెళ్లి.. చెక్ పాయింట్ల వద్ద పోలీసులు ఉన్నారా..? లేరా..? అనే విషయాన్ని గ్రహించి, సమాచారాన్ని చేరవేస్తూ.. ఒడిశా నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అబ్దుల్లాపూర్మెట్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది గంజాయి బ్యాచ్.